శీర్షిక:
నూతన శకానికి స్వాగతం పలకండి.
రాజీపడే నిరాశజీవులే అడుగడుగునా కనిపిస్తుంటే,
అహంకారం, స్వార్థం జాతి మనుగడనే మంటగలుపుతుంటే…
ఏమైపోతుంది స్వాతంత్ర్యం..!
ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..!
మోడువారిన హృదయాలు అతి భయంకర పాశానుల మధ్య అపహాస్యం పాలవుతుంటే…
ఏమైపోతుంది స్వాతంత్ర్యం..!
ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..!
మానవతా దీపం కొండెక్కిపోతుంటే…
ఏమైపోతుంది స్వాతంత్ర్యం..!
ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..!
మదమెక్కిన అంబోతులు రాక్షసత్వంతో రంకెలువేసి
అవాంఛనీయ చేష్టలు చేస్తుంటే…
ఏమైపోతుంది స్వాతంత్ర్యం..!
ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..!
ఎడారి ఆకలి మంటలు డొక్కలొ వేగంగా పాకుతుంటే బడికి వెళ్లే వయసులో తట్ట పార నెత్తిన పెట్టుకొని బతుకు వెళ్లదీస్తుంటే…
ఏమైపోతుంది స్వాతంత్ర్యం..!
ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..!
యువతీ యువకుల్లారా…
నవభారత పౌరుల్లారా…
భరతమాత కన్న కలలు నిజం చేస్తూ…
నూతన శకానికి స్వాగతం పలకండి…!
వందేమాతరం.
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి)
చరవాణి
