Breaking News ప్రకటనలు రాజకీయం

హోలీ పండగన కోడిగుడ్లు ఆమ్లెట్ గా అయ్యాయి … కొంతమంది యువకులవికృత చేష్టలు..

64 Views

సాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోడీ తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గ అందంగా వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు చల్లుకోవడం మొహంపై బొట్లుగా పెట్టడం అందులో నీళ్లు కలిపి వెదజల్లడం జరిగేది కానీ ఇప్పుడు కోడిగుడ్డు సరదా ఇంకా పోలేదు ఇలాంటి వికృత చేష్టాలకు గుడ్ బై చెప్పాలని అందరూ భావిస్తున్నారు అందులో సోమవారం కావడంతో కొంతమంది శివ భక్తులు మాంసాహారానికి దూరంగా ఉంటారు అలాంటి వారిపై కూడా కోడిగుడ్లు శిరస్సుపై చల్లడం ఎంతవరకు సబబు అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రంగుల పండుగ రోజున స్నేహితులు అందరూ కలుస్తారు అందులోను కొంతమంది శత్రుత్వం వారిపై బురద చల్లడం కోడిగుడ్లు కొట్టడం తర్వాత తిట్ల దండకం ప్రారంభిస్తారు ఇలాంటి విచిత్రం ఇదే రోజున జరుగుతుంది దీనిపై దృష్టి పెట్టాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చిన్నపిల్లలకు ఉన్న సరదా పెద్దవారికి సరియే విధంగా లేకుండా పోయిందని మరి కొంత మంది వాపోతున్నారు సహజ సిద్ధంగా చిన్నపిల్లలు రంగులతో కూడిన ప్యాకెట్లు తెచ్చుకొని అందరూ నేరు కలిపి చల్లుకొని ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కిరాణా షాప్ లో కోడిగుడ్లు కొనుక్కుని యువకులు నెత్తిపై కొట్టుకోవడం వల్ల తీవ్రకంపు కొడుతుందని తల్లిదండ్రులను మందలించిన విడిచిపెట్టడం లేదు. పండుగల తీరు విధానం మార్చుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్