నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసిన యూత్ లీడర్ భువన్ కుమార్
ఆగస్టు 26 మెదక్ జిల్లా
మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాను శనివారం నాడు మెదక్ యూత్ ఐకాన్ లీడర్ భువన్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మెదక్ లో కొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు.కొన్ని వార్డుల్లో కుక్కలు స్వైర విహారం మూలంగా అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలు ఇళ్లలోని బయటకు రావాలంటే భయపడుతున్నారమని పేర్కొన్నారు.ఈ విషయంలో తమరు వెంటనే పరిష్కారం చేయాలని యూత్ ఐకాన్ లీడర్ భువన్ కుమార్ కోరారు. ఆయన వెంట రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
