నేడు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు
చలో ఇందిరాపార్క్ – హైదరాబాద్
ఆగస్టు 26 మంథని
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సాధన కోసం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం నేడు హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకూరు నిర్వహించడం జరుగుతున్నదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రతినెల పెన్షన్, ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకాలలో 20 శాతం కోటా కేటాయించాలన్నారు. రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ టికెట్లు కేటాయించాలన్నారు. తెలంగాణలోని పరిశ్రమలన్నింటిలో తెలంగాణ ప్రాంత వాసులకే 90 శాతం ఉద్యోగ అవకాశాలు కేటాయించాలన్నారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకి తెలంగాణ ఉద్యమకారులు అందరు హాజరై విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డివిజన్ అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయకుమార్, మంథని మండల ప్రధాన కార్యదర్శి జాడి జంపయ్య, జిల్లా కార్యదర్శి కాసిపేట సాంబయ్య, సలహాదారు పల్లె రాజయ్య, జిల్లా నాయకులు గుర్రం దేవేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల గట్టయ్య, మండల నాయకులు రోడ్డ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
