Breaking News

ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ ఆందోళన  

104 Views

ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ ఆందోళన

వినతి పత్రం అందజేశారు

ఆగస్టు 26.23 శివంపేట మండలం మెదక్ జిల్లా

ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు శనివారం నాడు ఆందోళన చేపట్టారు. అనంతరం ఉప తాహసీల్దార్ షఫీహోద్దీన్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా 18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘ అధ్యక్షురాలు గోపమ్మ కార్యదర్శి రేణుక, సబితా వెంకటమ్మ అనసూయ ఉన్నారు‌.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *