Breaking News

మేము సైతం అంటూ

143 Views

మేము సైతం అంటూ

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు దీక్షలో కూర్చున్న వృద్ధులు వికలాంగులు

అక్టోబర్ 8

సిద్దిపేట జిల్లా  చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై రిలే నిరాహార దీక్షలను ముందుండి నడిపిస్తున్న జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్  మరియు కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి  ఆధ్వర్యంలో ఆదివారం 28 వ రోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించుట కొరకు తెలంగాణ వికలాంగుల వేదిక సంఘం నాలుగు మండలాల వికలాంగుల అంతా కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారు మాట్లాడుతూ.

మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాము చేర్యాల మరియు 4 మండలాల అయినటువంటి చేర్యాల మద్దూరు కొమురవెల్లి దూల్మిట్ట ప్రజల చిరకాల ఆకాంక్ష,మరియు అభివృద్ధి కొరకు చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నాలుగు మండలాల ప్రజలంతా కలిసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని తెలిపారు.రిలే నిరాహార దీక్షలు చేస్తుంది చేర్యాల రెవెన్యూ డివిజన్ గా కోరుకుంటుంది ఇక్కడ దీక్షలో పాల్గొన్న ఏ ఒక్కరు తమ స్వార్థం కోసమో తమ రాజకీయం కోసమో కాదు నాలుగు మండలాలలో జీవిస్తున్న ప్రజల కష్టాలు తీరాలనే…. అందుకు చేర్యాల రెవెన్యూ డివిజన్ గా అయినప్పుడే నాలుగు మండలాల ప్రజల కష్టాలు తీరి ఇక్కడి ప్రజల అభివృద్ధికి మొదటి మెట్టు అని మీకు ఈ సభ పరంగా తెలియజేస్తున్నామని చెప్పారు.

ఈ దీక్షలో వృద్ధులు వికలాంగులమైనటువంటి మేము నాలుగు మండలాల నుంచి వచ్చి దీక్షలో కూర్చున్నామంటే ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకోవా రెవెన్యు డివిజన్ ప్రకటించవా అని మిమ్మల్ని ముక్కు సూటిగా అడుగుతున్నామని వికలాంగులు తెలియజేశారు.

చేర్యాల అభివృద్ధి మీకు ముఖ్యమనిపిస్తే మీరు వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని కోరారు.లేదు కాదు కూడదు అని అంటే ఈ పోరాటం ఇంకా ఉద్రిక్తంగా మారి చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య,సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అరగొండ మల్లేశం,రాష్ట్ర అధ్యక్షులు సుతారి రమేష్, చేర్యాల  అధ్యక్షులు తుమ్మలపల్లి అనిల్, చుంచనకొట గ్రామ అధ్యక్షుడు దొడ్డి మల్లేశం, మెరుగు శ్రీను,అందే సాగర్,తుమ్మలపల్లి అనిల్ కుమార్, కడవేర్గు జంగస్వామి పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *