Breaking News

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

304 Views

జిల్లా ఎస్పీ  ఈరోజు ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహిస్తూ,డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.

విజబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.

విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచు పర్యటిస్తూ గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని అన్నారు.అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలకు చట్టాల మీద, డయల్100,షీ టీమ్స్, సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకం అని కమ్యూనిటీ పోలీసింగ్ లో Minimum four CCTV Cameras for village Project లో భాగంగా మండల పరిధిలోని ప్రతి గ్రామంలో నాలుగు సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధముగా ప్రజలను అవగాహన పరచాలని ఎస్పీ  సూచించారు.ఎస్పీ  వెంట సి.ఐ శశిధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *