– సందడిగా మారిన క్యాంపు కార్యాలయం
మానకొండూర్ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా.రసమయి బాలకిషన్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే
డా.రసమయి బాలకిషన్ కి రోజురోజుకు అభినందనలు వెళ్ళు వెత్తుతుండంతో క్యాంపు కార్యాలయం పూర్తిగా సందడిగా మారింది.
శుక్రవారం మానకొండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి రసమయి కి గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు వేకువ జాము నుండి భారీ సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి చేరుకొని ప్రజానాయకుడు రసమయి కి శుభాకాంక్షలు తెలుపుతూ తమ సంపూర్ణ మద్దతు పలికారు..