*బస్సు కోసం విద్యార్థులు రాస్తారోకో*
రాయపోల్:
మండల పరిధిలోని రామరం, వడ్డేపల్లి, మహమ్మద్ షాపూర్, గొల్లపల్లి గ్రామాల నుండి విద్యార్థులు గత నెల రోజుల నుండి బస్సు రాక అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రోజున రామారం గుర్రాల సోఫా వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు ప్రతినిత్యం కళాశాలకు సమయానికి హాజరు కాలేకపోతున్నారు. విద్యార్థులు బస్సు కోసం రెండు మూడు కిలోమీటర్ల నడవాల్సి వస్తుందని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సరైన టైంలో బస్సులు కల్పించాలని విద్యార్థిల తల్లిదండ్రులు పేర్కొన్నారు. సంఘటన తెలుసుకున్న రాయపోల్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను సముదాయించారు. డిపో మేనేజర్ మేనేజర్ తో మాట్లాడి బస్సులు వచ్చే విధంగా చూస్తామని అన్నారు.





