171 Views
ఎల్లారెడ్డిపేట మండల సెర్ఫ్ నూతన కార్యవర్గం
కావేరి మండల సమాఖ్య అధ్యక్షురాలు అధ్యక్షతన మహాసభ నిర్వహించారు.శుక్రవారం మండల కేంద్రము లోని గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యాలయం లో మహాసభ ద్వారా నూతనపాలక వర్గాన్ని అన్ని గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షు కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా బైరి జ్యోతి జై హనుమాన్ వి.ఓ. దుమాల, ఉపాధ్యక్షురాలు గా మానస శివపర్వతి వి.ఓ.ఎల్లారెడ్డిపేట,కార్యదర్శిగా సుమలత శ్రీ హనుమాన్ వి.ఓ.సింగారం,సహాయ కార్యదర్శిగా రమ్య తులసి వి.ఓ.ఎల్లారెడ్డిపేట,కోశాధికారిగా మినా చైతన్య వి.ఓ.వెంకటపూర్ లు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎపియం మల్లేశం,మండల సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి,సిసి లు,మండల సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.