130 Views
బాధిత కుటుంబానికి చేయూత మిత్ర ఫౌండేషన్ పక్షాన చేయుతనందించారు. ఎల్లారెడ్డిపేట కు చెందిన భూమయ్య గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించాడు. అంతకు ముందు సంవత్సరం క్రితం కొడుకు చనిపోయారు. నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కొడుకును కోల్పోయింది. వృద్ధురాలికి చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5500 రూపాయలు 25 కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు. బాధిత కుటుంబానికి దాతలు ఆదుకోవాలని చేయూత ఫౌండేషన్ ద్వారా విన్నవించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు దూస శ్రీనివాస్,బంధారపు లక్ష్మారెడ్డి,బాధ గోపి,యమగొండ పద్మారెడ్డి, మహమ్మద్ బాబా, కదిరే రవి, వడ్నాల ఆంజనేయులు,దీటి సతీష్,వల్లకాటి సిద్దిరాములు,మల్లికార్జున్ ,తదితరులు పాల్గొన్నారు.