ప్రాంతీయం

చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాప్తి చెందుతున్న *”కళ్ల కలక”*

160 Views

మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు.

నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది

పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పాఠశాలలు

 

ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కళ్ల కలక’ కలకలం సృష్టిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ఉష్ణోగ్రత మారాయి.. ఎడతెరపి లేని వానలు.. వరదల కారణంగా వైరస్‌ విజృంభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కళ్ల కలక వైరస్‌ లేదా బ్యాక్టీరియా/ అలర్జీ కారణంగా వస్తుందని ఆశ్వీణీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జి సత్యనారాయణ స్వామి చెప్పారు. అడినో వైరస్‌లతో తలెత్తే కళ్లకలక (కన్‌జన్‌క్టివైటిస్‌) ఇప్పుడు దేశమంతా విస్తరిస్తోందని వార్తల ద్వారా తెలుస్తోంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందని . ముఖ్యంగా స్కూల్‌ పిల్లలకు ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది . గుంపులుగా ఉండే ప్రదేశాల్లో అధికంగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలున్నాయన్నారు.​
కళ్లకలకలు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా వస్తాయని
ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్‌ ఇతర వ్యక్తులకు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుందని స్వామి. ఎక్కువ శాతం చేతులు కళ్లలో పెట్టుకోవడం ద్వారా సోకుతుంది.
ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్‌, బ్యాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరడం ద్వారా ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉందని.
కాంటాక్టు లెన్స్‌ వినియోగించే అలవాటు ఉన్నవారు వాటిని సక్రమంగా శుభ్రం చేసుకోవాలి. సరైన లెన్స్‌ వాడకపోవడం వల్లనూ కలక రావొచ్చు.
బ్యాక్టీరియా, వైరస్‌ వల్ల వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి.
రసాయనాలు, వాహనాల పొగ, సౌందర్య ఉత్పత్తుల వాడకం వల్ల కూడా వ్యాపిస్తాయి.
అలర్జీ, దుమ్ము-ధూళి, పెంపుడు జంతువులు, పూల పుప్పొడి ద్వారా వచ్చే అవకాశం ఉంది
సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులపాటు ఇది ఉంటుంది.
​ కళ్లు ఎర్రగా మారి నీరు కారడం, మండిపోవడం
కళ్లల్లో దురద, చికాకుగా ఉండడం, పుసులు కట్టి అంటుకుపోవడం
చిన్నారుల్లో స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం.
ఒక కన్ను లేదా రెండు కండ్లు ఎర్రగా మారడం.
కళ్లలో మంట, నొప్పి, దురద ఉండటం.
కనురెప్పలు వాపు రావడం.
కంటిరెప్పలు అతుక్కోవడం(ముఖ్యంగా ఉదయం నిద్రలేచేసరికి ఎక్కువ ఊసులతో కనురెప్పలు అతుక్కుని కనిపిస్తాయన్నారు)
ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం
కళ్ల నుంచి నీరు లేక చిక్కటి స్రావం కారడం
కండ్ల కలకకు కారణమైన వైరస్‌తో సాధారణ జలుబు కూడా వస్తుందని డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అన్నారు
ఈ జాగ్రత్తలు తీసుకోండి..

లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం, కళ్లపై చేతులు పెట్టకూడదు.
శుభ్రమైన టిష్యూ కాగితం, చేతి గుడ్డతో కండ్లు తరచూ తుడుచుకోవాలి.
నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
వేడిచేసి చల్లార్చిన నీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలి.
కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటిబయాటిక్స్‌ చుక్కల మందులు వాడాలి.
కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకునేవారు వాటిని మానేయాలి.
వైరస్‌ వల్ల కలిగే సమస్య ఒకట్రెండు వారాల్లో తగ్గిపోతుంది.
బ్యాక్టీరియాతో సమస్య ఏర్పడితే మెడిసిన్‌ కచ్చితంగా తీసుకోవాలి.
ఎలా నివారించాలి..?
ఈ వైరస్‌ వ్యాప్తి ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా ఉంటుందని, చిన్న చిన్న జాగ్రత్తలతో దీని బారిన పడకుండా అప్రమత్తంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నల్ల కళ్లద్దాలు ధరించాలి. దీంతో కళ్లకు ఎక్కువ వెలుతురు తగలదు. ఇతరులకు అంటుకోకుండా నిలువరిస్తుంది.
చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలకకు కారణమయ్యే వైరస్‌, బ్యాక్టీరియా ఆయా ఉపరితలాల మీద ఎక్కువసేపు జీవించి ఉంటుంది. వాటిని తాకిన చేతులతో కళ్లను రుద్దుకుంటే వెంటనే అంటుకుంటుంది.
కళ్లకలక వచ్చినవారు తమ దుప్పటి, తువ్వాలు వంటివి విడిగా పెట్టుకోవాలి. ఇతరులు వాడుకునే వాటితో కలవనీయొద్దు. ఫోన్‌ వంటి పరికరాలు షేర్‌ చేసుకోవద్దు.
సాధారణంగా వైరల్‌ కళ్లకలక ఒక కంటికే వస్తుంటుందని . దీన్ని తాకిన చేతిని మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు.
కళ్లకలక ఉన్నవారు కళ్లను చూస్తే తమకూ అంటుకుంటుందని కొందరు అనుకుంటారు. ఇది నిజం కాదు. చేతులతో లేదా నీటితో వైరస్‌ కళ్లకు అంటుకుంటే తప్ప కళ్లకలక సోకదన్నారు,
ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అన్నారు ,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో ఉన్న వివిధ రకాల పూలమొక్కలకు ప్రైమరీ స్కూల్ ప్రదానోపాద్యాయులు సంతోష్ పాఠశాల సిబ్బంది తో కలిసి శుక్రవారం దోమల నివారణకోసం క్రిమిసంహారక మందులను చేతిపంపుతో స్ప్రే చేశారు,
మండలంలోని అన్ని పాఠశాలల్లో దోమల నివారణ కోసం క్రిమి సంహారక మందులను స్ప్రే చేయించాలని పలువురు జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు ,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *