ముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో పోలియో దినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలియో రహిత సమాజాన్ని పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలకు వినియోగించుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్, తాళ్ళ విజయ్ రెడ్డి, ఎన్ ఎస్ యుఐ నాయకులు మీరుదొడ్డి భాను, వెంకట్రపల్లే మద్ధికుంట చీకొడు గ్రామశాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, ధోనుకుల కొండయ్య, కొప్పు రమేష్, సీనియర్ నాయకులు వేల్ముల రాంరెడ్డి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
