*ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఎస్సీ బీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం…*
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను గడపగడపకు తిరిగి ప్రజలకు వివరిస్తూ, BRS, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పిన యూత్ కాంగ్రెస్ నాయకులు
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇచ్చి అమలు చేయని పథకాలు
1.KG టూ pg ఉచిత విద్య,
2.ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి.
3.నిరుద్యోగులకు ఉద్యోగాలు
4.sc/st, మైనారిటీలకు 12% రిజర్వేషన్ చేస్తానన్న హామీలను నేటి వరకు అమలు చేయడం లేదని ప్రజలకు వివరించారు.
అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.
1) ఇంటినిర్మాణానికి ఐదు లక్షల రూపాయల సాయం
2)రైతులకు రెండు లక్షల రుణమాఫీ
3)మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు
4)భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏడాది 12000 వేలు
5)గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వడం లాంటి పథకాలు అమలు చేస్తామని ప్రజలకు వివరించారు..
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ పగిడికత్తుల సుదర్శన్, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కైలాసపు గోపి,జెర్రిపోతుల మురిళి కృష్ణ,సోమనబోయిన సాయి నవీన్,శ్రీనివాస్, కిన్నెర రమేష్, కిన్నెర రవి,జోలకంటి గోపి,ఉమ్మనేని విజయ్,నందిగామ సిద్దు, పగిడికత్తుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
