Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..

164 Views

(తిమ్మాపూర్ ఆగస్టు 07)

వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు.

మానకొండూరు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ సహకారంతో మంజూరు చేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎల్.గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి, ఆఫీస్ ఇంచార్జ్ గోపు మల్లారెడ్డి లు కలిసి గొల్లపల్లి గ్రామనికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, మాజీ ఎంపీటీసీలు చింతల లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండలం ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్