*కోరుట్లలో…* *పద్మశాలి రాజకీయ* *యుద్ధభేరి*
*(పద్మశాలి ఆత్మగౌరవ సభ) విజయవంతం ,దిగ్విజయవంతం,,*
, హైదరాబాద్:*
*పద్మశాలి ఆత్మగౌరవం* కోసం నిర్వహించిన పద్మశాలి రాజకీయ *యుద్ధభేరి దిక్కులు* *పిక్కటిల్లేలా మార్మ్రోగినది* .
*స్వర్గీయ గుంటుక* *నరసయ్య పంతులు*
గారి ప్రాంగణం పద్మశాలి జన ప్రభంజనంతో హోరెత్తింది. పద్మశాలి జన సందోహంతో పోటెత్తింది. *ప్రత్యేక తెలంగాణ* *సాధనకోసం ప్రాణాలకు తెగించి, కొట్లాడి, ప్రాణాలర్పించిన* పద్మశాలీల్లో
స్వరాష్ట్ర సాధన అనంతరం ప్రాధాన్యం, సంక్షేమం, సమన్యాయం లోపించి, అన్ని రంగాలలోనూ వెనుకకు నెట్టివేయబడిన కారణంగా ఆవేదనతో కూడిన ఆక్రోశం కట్టలు తెంచుకుని, మండే గుండెలతో రగిలిపోయిన పద్మశాలి సమాజం…
*సమరశీలురు,* *సత్సంకల్పురు* యిచ్చిన పిలుపుతో సొంత వాహనాలలో, సొంత ఖర్చులతో నిర్వాహకుల అంచనాలకు మించి కుటుంబ సమేతంగా సభా సమరంలో మమేకమైయ్యారు., ప్రముఖ రాజకీయ పార్టీల సభలనూ మరిపించారు., యావత్ *పద్మశాలి* *సమాజాన్ని* *మురిపించారు…*
*ఈలలు.., కేరింతలు..,* *చప్పట్లు..,* *మేళతాళాలు ..,* *మృధువైన గీతాలు..,* *డప్పులు.., జానపద గేయాలు.., పారవశ్యంతో చేసిన పలు విన్యాసాల సమ్మేళనంతో సభాప్రాంగణం దద్దరిల్లినది.*పద్మశాలి జాతి చరిత్రలో ఆగష్టు 13* *ధన్యమైంది* . చేతులెత్తి ” *పద్మశాలీల ఐక్యత* *వర్ధిల్లాలి”* అని నినదించిన నినాదం యావత్ పద్మశాలి జాతిని మేల్కొలిపింది. ఒక ఉద్యమం వైపుగా నడిపించింది. లక్ష్యం దిశగా పరుగులెత్తించి విజయాన్ని అందించబోతుంది.
*ఒక పండుగకు మించిన* *జాతరలా, ఒక* *జాతరను మించిన* *ఉత్సవంలా,* *ఒక ఉత్సవాన్ని మించిన మహోత్సవంగా* ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగి, జనసంద్రమైన తీరు చుసినవారందరికీ ఆనందమానందమైంది.
*ఎలగందుల రమణ * *ఎమ్మెల్సీ*
రెక్కాడినా డొక్కాడని నేతన్నలకు రాష్ట్ర కేంద్ర స్థాయిలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరగాలని, జగిత్యాల పట్టణ పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్న తనకు జగిత్యాల కరీంనగర్ పద్మశాలి సమాజం వలన
రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం వచ్చిందనీ, రాష్ట్ర మంత్రిగా, లోకసభ సభ్యునిగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, *జీని రామ్మూర్తి గారు* నిర్వహించిన సభలు, సమావేశాల వలన తన రాజకీయ ఎదుగుదల ప్రారంభమైనదని పద్మశాలి సమాజానికి *స్వర్గీయ జీని రామ్మూర్తి గారికి కి కృతజ్ఞతాభివందనాలు* తెలియజేశారు.
*గుండు సుధారాణి , వరంగల్* *మేయర్…*
వరంగల్లులో తన మామగారు ఆయనకున్న అనుభవంతో అనేక పద్మశాలి సంఘాలను పద్మశాలీయుల ఆత్మీయ అనుబంధంతో తీర్చిదిద్దారనీ, అది తన రాజకీయ రంగ ప్రవేశానికి తోడ్పడినదనీ, పద్మశాలి సమాజం పెద్దల వలననే తాను రాజకీయంగా అనేక పదవులు పొందగలిగానని పద్మశాలి సమాజానికి కృతజ్ఞతలు తెలియ జేశారు.
*సమాజసేవకులు రామ* *శ్రీనివాస్ *
పద్మశాలి రాజకీయ యుద్ధభేరి ప్రపంచ పద్మశాలి చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని, యింత పెద్ద సంఖ్యలో పద్మశాలి ప్రజానీకం హాజరైన సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని అభివర్ణించారు. పద్మశాలి ప్రజానీకాన్ని ఉత్సాహపరిచారు, ఈలలు వేయించారు, చప్పట్లు కొట్టించారు, కేరింతలతో ఉరకలెత్తించారు.
*ఎప్పుడైనా., ఎక్కడైనా., ఏ* *ఎన్నికలైనా., పద్మశాలీలు* *పోటీచేసిన* *చోట…*
*”నోట్లు తీసుకోండి! కానీ, ఓట్లు పద్మశాలి* *అభ్యర్థులకే వేయాలి”*
*”పద్మశాలి బిడ్డకు మాత్రమే* *ఓటు వేయాలి”*
ఉద్వేగభరితమైన ప్రసంగంతో బహిరంగ సభకు విచ్చేసిన వారందరి చేత నినదింపచేశారు.
*”తెలంగాణ రాష్ట్రంలో 24* *శాసనసభ* *నియోజకవర్గ స్థానాలు* *మావే (పద్మశాలీయులవే)”*
అని పెద్దగా గద్దించేలా సభికులకు ఊపు
నిచ్చి సభకు ఊపిరి పోశారు.
పద్మశాలి సమాజంలో వున్నవారిలో
*5 శాతం వారికి మాత్రమే* చేనేత పథకాలు అందుతున్నాయనీ, మిగతా వారు
చిన్నచిన్న వృత్తుల్లో, చేనేతేతర వృత్తుల్లో జీవనం సాగిస్తున్న మిగిలిన *95 శాతం పద్మశాలీలకు* కూడా మేలు జరగాలని నినాదాలతో హోరెత్తించగా.,
సభాప్రాంగణమంతా *నినాదాలతో దద్దరిల్లింది.*
*రాపోలు ఆనంద భాస్కర్ ,*
*మాజీ రాజ్యసభ* *సభ్యులు…*
అతిరథ మహారధులతో గుంటుక నర్సయ్య పంతులు గారి సభాప్రాంగణం నిండిపోయిందని., ప్రతి పద్మశాలి తన బాధ్యతగా భావించి ఈ రాజకీయ యుద్ధభేరికి తరలి వచ్చారనీ, వారికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నానన్నారు.
*కులం ఒక్కటే.,* *కులసంఘం ఒక్కటే.!*
వారానికి ఒకరోజు ఒక గంటసేపు మార్కండేయ స్వామి భవన్ లోనో, గుడిలోనో పద్మశాలి సామాజికులు సమావేశం కావాలనీ, అక్కడ తమతమ కష్టనష్టాలు, సుఖసంతోషాలు ముచ్చటించుకొని ఒకరికి ఒకరు సహకరించు కోవాలని అన్నారు.
*Dr.సంజీవ్ కుమార్ ,* *లోక్ సభ* *సభ్యులు…*
తెలంగాణ పద్మశాలీయుల నుండి ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయులు నేర్చుకోవాలని తన తండ్రిగారు చెప్పే వారని, నేడు ఇక్కడ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుందని, తాను ఎంపీగా ఉండటంవలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలకు అనేక సంక్షేమ పథకాలను రూపొందింపజేసి అమలు చేయించగలుగుతున్నానని అన్నారు.
పరికిపండ్ల నరహరి గారు,* *ఐఏఎస్.*
ఏడు రాష్ట్రాల నుండి పద్మశాలీయులు వచ్చారని, పద్మశాలీయులు తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలని, సకల రంగాల్లో పద్మశాలీయులు ముందుండాలని, రాజ్యాధికారము లేకుండా ఏ జాతి అభివృద్ధి సాధించదని,
పద్మశాలీయులు చట్టసభల్లో చట్టాలు రూపొందించే స్థాయిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
*ఈరావతి అనిల్ కుమార్* *, మాజీ* *ఎమ్మెల్యే…*
*పద్మశాలి సమాజానికి* జరిగిన ద్రోహం తలచుకొని, ఈ యుద్ధభేరి తమదిగా భావించి కనీవినీ ఎరుగని రీతిలో పద్మశాలి ప్రజలు తరలి వచ్చారని, ఒకజాతిలో వున్న వారు రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతే, ఆ జాతే అస్తిత్వాన్ని కోల్పోతుందని, పీడిత ప్రజలైన పద్మశాలీల సంక్షేమానికి కృషి జరగటంలేదని, దండిగా భూములున్న *భూస్వాములకే రైతు బంధులాంటి* పధకాలందుతున్నాయని, పద్మశాలీయులకు ఉండటానికి కనీసం ఒక *గుంట భూమి కూడా లేదని* ఆవేదన వ్యక్తం చేశారు.
వివిధ రాష్ట్రాల నుండి వివిధ సంఘాల నుండి విశిష్టులైన, ప్రసిద్ధులైన పద్మశాలీలతో పాటు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నుండి AIWF TS కోర్ సభ్యులు వేముల బాలరాజు, గడ్డం వెంకటేశ్వర్లు, రాపోలు జ్ఞానేశ్వర్, మిర్యాల వెంకటేశం, మారం శ్రీనివాస్, నక్క కాశీనాథ్, చేనేత కవి రాపోలు జగన్ తదితరులు హాజరయ్యారు.
సమాజంలోని అన్ని చేనేత సామాజిక వర్గాలవారు భవిష్యత్తులో కలసి ప్రయాణం చేస్తే, మన చేనేత సమాజం మరింత బలోపేతమవుతుందనీ, అప్పుడు మన పద్మశాలీయులకు మరింత మద్దతు లభించడంతో పాటుగా సహచర చేనేత
సామాజిక వర్గాలవారు కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని సవినయంగా
మనవి చేసుకుంటూ…
*అన్ని చేనేత సామాజిక* *వర్గాలవారం* *అందరమూ* *సోదరులమేనన్న సద్భావనతో …*
*ఆల్ ఇండియా వీవర్స్* *ఫెడరేషన్*
