రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ స్థానానికి బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన లక్కిరెడ్డి రాజేందర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బైక్ ర్యాలీగా వెళ్లి సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతులకు సేవ చేసేందుకు ఈ పోటిలో ఉంటున్నట్లు, రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి వెన్ను దన్నుగా నిలుస్తానని ఆయన అన్నారు.రైతులు, మండల ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి అంకని బాను, జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెళ్లి స్వామిగౌడ్, జిల్లా నాయకులు బందెల దేవరాజ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కోడూరి బాల్ లింగం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు ,మండల అధ్యక్షులు మైసగళ్ళ అనిల్, మండల కోశాధికారి రాఘవపురం వెంకటేష్, సీనియర్ నాయకులు దోసెల ఉపెందర్, బందెల ఎల్లయ్య,లింగన్నపేట గ్రామ అధ్యక్షులు కొత్తపల్లి బాబు,శశికిరన్ ,శివరాజం, స్వామి,బాబు,నాగరాజ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
