– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన్నెంపల్లి ఉప సర్పంచ్
2022–23 విద్యా సంవత్సరంలో పదోతరగతిలో మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మన్నెంపల్లి ఉప సర్పంచ్ పొన్న అనిల్‌గౌడ్ నగదు ప్రోత్సాహం అందించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు,పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థులు పోటీపడి చదివారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించారు. దీంతో మొదటి అయిదుగురు విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదు అందించారు. టెన్త్‌లో అగ్రస్థానంలో నిలిచి ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన పొరండ్ల గ్రామానికి చెందిన పార్నంది అక్షిత, అరెళ్లి సాయిశ్రీజ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2వేల చొప్పున అందిచారు. మరో నలుగురికి రూ.500 చొప్పున సాయం అందించారు.
ఈ సందర్భంగా అనిల్‌గౌడ్ మాట్లాడుతూ చదువులోనే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థులను చదువులో పోటీ పడేందుకు నగదు సాయం అందించారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటానని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించిన పొన్నం అనిల్‌గౌడ్‌ను గ్రామ సర్పంచ్ మెడి అంజయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారుతి ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్ సత్కరించారు. ఈ కార్యక్రమం లో వార్డ్ సభ్యులు నార్ల అశోక్, పార్నంది సంపత్, మున్ననూరి గోవిందరావు,నాయకులు సుధగోని సాధయ్య,బొజ్జ శ్రీనివాస్,పోతుగంటి రమేష్, అశోధ సురేష్,తదితరులు పాల్గొన్నారు