ఎల్లారెడ్డిపేటలో భారీ వర్షం….
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది శుక్రవారం రోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల వద్ద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలేర్ట్ ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని దగ్గు జ్వరం జలుబు లాంటి లక్షణాలు ఉంటే వీలైనంత త్వరలోనే ప్రజలుజాగ్రత్త పడాలని ఆరోగ్యాధికారులు చెబుతున్నారు
