జనగాం డిసెంబర్ 19 :మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ.
జనగామ నియోజకవర్గం బచ్చన్న పేట మండలం బండనాగారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొప్పరపు కిష్ణారెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం మృతుడి కిష్ణారెడ్డి నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు..అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శిం చారు.ఆయన వెంటా నాయకులు ఇర్రి రమణ రెడ్డి పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు.