Breaking News

నిజాం సర్కార్ ను గద్దె దించిన అనభేరీ ప్రభాకర్ రావు జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహించాలి

98 Views

కామ్రేడ్ బోయిని తిరుపతి
సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండల కార్యదర్శి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ అనభేరి ప్రభాకర్ రావు 110 వ జయంతి నీ సీపీఐ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో బోయినీ తిరుపతి ఆధ్వర్యంలో ఆనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు.

ఈ కార్యక్రమంలో
బోయిని తిరుపతి మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి అమరుడైనటువంటి ప్రభాకర్ రావు నాడు ఆంధ్ర మహాసభల పిలుపునందుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసి పడేలా చేసిన మహావీరుడు ప్రభాకర్ రావు ఒకపక్క గ్రామాల్లో దొరలు భూస్వాములు పేద ప్రజలను వారి భూములను లాక్కొని దౌర్జన్యాలు చేస్తుంటే ఎర్రజెండా పక్షాన వారిని ఎదుర్కొని ఆ భూములను పేదలకు పంపిణి చేశారు.

మరోపక్క నిజాం నవాబు యొక్క సైనికులు రజాకార్లు మహిళలను పిల్లలను బానిసలుగా చేసి వారి ఆకృత్యాలను తీర్చుకునేవారు అలాంటి సమయంలో ప్రభాకర్ రావు సొంత దళాలను ఏర్పాటు చేసి గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించారు అతని పోరాటపటిమనీ ఎదుర్కోలేక రజాకార్లు వెనుతిరిగి పోయారు.సుమారు 40 గ్రామాలను దత్తత తీసుకొని పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినారు తెలంగాణను అనుకోనీ ఉన్నటువంటి మహారాష్ట్ర చంద్రపూర్ కర్ణాటక బాడర్లలో ఇతని దళాలు చాకచక్యంగా రజాకారలు ఎదిరించడంలో విజయం సాధించాయి. చివరగా మహమ్మదాపూర్ గుట్టల్లో రజాకార్ల చేతిలో ఎన్కౌంటర్ చేయబడ్డాడు తెలంగాణలో మొట్టమొదటి ఎన్కౌంటర్ గా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు ప్రభాకర్ రావు మరణ అనంతరం నిజాం నవాబు తన సంస్థానాన్ని వదిలి భారతదేశంలో విలీనం చేసి వెళ్లిపోయారు.

మరి ఇంతటి గొప్పటి వీరున్ని ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పక్కకు పెట్టింది కావున జయంతి వర్ధంతిలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ముత్త ఏల్లస్వామి, నాయకులు మేకల శ్రీనివాసు,ఈర్ల కొమురయ్య,గోల్లేన రాజయ్య,
అనవెని రాములు, కనకo మొండయ్య, కనకం కొమరయ్య, పప్పు రాజు, కార్మికులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *