– ఏళ్లనాటి కళ సాకారం
– నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంకు రూ.20.54 కోట్లు విడుదల
– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
దౌల్తాబాద్; మట్టిరోడ్ల దశాబ్దాల కళ నేడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి తో నేడు నెరవేరింది.. ఎన్నో ఏళ్లుగా బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు.దుబ్బాక నియోజకవర్గంలోని 10 మట్టి రోడ్ల కు గాను 25 కిలోమీటర్ల నిర్మాణం కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి కృషి తో జీవో ఆర్టీ నెంబర్ 373 ద్వారా సీఆర్ఆర్ ద్వారా రూ.20.54 కోట్లు మంజూరు చేయించారు.. నియోజకవర్గంలోని చేగుంట మండలంలోని పోతాన్ శెట్టిపల్లి నుండి పెద్ద శివనూర్ వరకు 3 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.50కోట్లు, రుక్మాపూర్ నుండి కరీంనగర్ వరకు 3కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.49 కోట్లు, బోనాల పిట్టల తండా వరకు 3 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.40 కోట్లు,
నార్సింగి మండలంలోని నర్సంపల్లి, ఖాస్లాపూర్ వయా చిన్న తాండా వరకు 2.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.12 కోట్లు, జడ్పీ రోడ్ నుండి జమ్లాతండా, పెద్ద తండా వరకు 1.20 కిలోమీటర్ల రోడ్లు కు రూ.90 లక్షలు,
తొగుట మండలంలోని మర్రికుంట-గుడికందుల వయా వర్ధరాజ్ పల్లి వరకు 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.70 కోట్లు, మెట్టు – బండారుపల్లి వరకు 2.90 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.25 కోట్లు,
దౌల్తాబాద్ మండలంలోని దౌల్తాబాద్ పీడబ్ల్యూ రోడ్ నుండి ఉప్పరపల్లి వరకు 2కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.70 కోట్లు, మిరుదొడ్డి మండలంలోని మాదన్నపేట , జంగపల్లి మీదుగా ఆలయం వరకు 2కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.70 కోట్లు,
రాయపోల్ మండలంలోని రాయపోల్, ఉదయపూర్ మీదుగా తిర్మలాపూర్ పెద్దమ్మ గుడి వరకు 3.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరు చేయడం జరిగింది..మట్టి రోడ్ల స్థానంలో బీటీ రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..మాటలు..కాదు చేతల్లో దుబ్బాక అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే దక్కుతుందని పేర్కొంటున్నారు.. ఇప్పటికే వందల కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, బీటీ రోడ్ల నిర్మాణం, రిన్యువల్ చేయించడం జరిగింది.