ఆస్తికోసం అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో చోటుచేసుకుంది. శంకరయ్య, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు ప్రశాంత్ పెళ్లి చేసుకొని ఊర్లోనే ఇళ్లరికం వెళ్ళాడు. ఇల్లరికం వెళ్లినప్పటికీ ఆస్తిలో వాటా వస్తుందని ప్రశాంత్ నిన్న అర్థరాత్రి అన్నతో గొడవకు దిగి… ప్రవీణ్ (30) పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రవీణ్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.



