చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆది శ్రీనివాస అధ్యక్ష వహించగా ! ముఖ్యఅతిథిగా చేర్యాల తాసిల్దారు ఆరిఫా మాట్లాడుతూ దళితుల హక్కులు, చట్టాలు, అంటరానితనం నిర్మూలన, బాల కార్మికుల చట్టాల పైన, ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్ పై అవగాహన కల్పించారు. కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత కర్రోల నవజీవన్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, కర్, వార్డెన్ రాజయ్య, మాజీ ఉపసర్పంచ్ గొర్రె శ్రీనివాస్, వికలాంగుల జిల్లా అధ్యక్షులు సుతారి రమేష్, రిటైర్డ్ ఎమ్మార్వో శ్రీహరి, వీఆర్ఏ లు, కారోబార్ అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
