*బోయినపల్లిలో రేపు కాంగ్రెస్ నేతల సమావేశం*
హైదరాబాద్:ఆగస్టు 11
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పై కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నది.
ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు.
రేపటి కార్యక్రమంలో రాష్ట్రవాప్తంగా నిరసనలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్, మధు యాష్కీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, వివిధ కమిటీల చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, టీపీసీసీ కార్యవర్గం, డీసీసీలు సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు…
