క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్
వేములవాడ – జ్యోతి న్యూస్
వేములవాడ రూరల్ మండల పరిధిలో గల నూకలమర్రి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల యందు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉచిత కబడ్డీ శిక్షణ కేంద్రం ఇటీవల ప్రారంభం అయి శిక్షణ కొనసాగుతుంది. ఇట్టి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల కు క్రీడా దుస్తుల వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది. అనంతరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయి అని, భవిష్యత్తులో క్రీడల తో స్పోర్ట్స్ కోటా తో ఉద్యోగాల కు అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుండి క్రీడల పట్ల అవగాహనా కలిగి ఉండాలి అని దీనితో ఆరోగ్యం గా ఉండి ఉన్నత లక్ష్యాలు సాధిస్తారు. కబడ్డీ లో మంచి ఆట తీరు కనపరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి అని శిక్షణ అభ్యర్థుల కు పలు సూచనలు చేశారు. అనంతరం నూకలమర్రి సర్పంచ్ పెండ్యాల తిరుపతి మాట్లాడుతూ పోలీస్ వారు తమకు ఎల్లవేళలా సహకరిస్తున్నారని, యువత ను ప్రోత్సహించటం లో పోలీస్ లు ముఖ్య పాత్ర వహిస్తున్నారు అని కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించిన యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ ని అభినందించారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ చంద్రయ్య,
కబడ్డీ కోచ్ సోమినేని బాలు, సీ వై సీ అధ్యక్షులు జగదీశ్వర్, కార్యదర్శి జనార్దన్, బొడ్డు గణేష్, యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, సభ్యులు రామ్, సాయి మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.