Breaking News

సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్

196 Views

వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్

చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 13 :

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ కోకన్వీనర్ గూడూరి భాస్కర్ రాజన్నపేట ఎం పి టి సి దారావత్ రజిత అలంకరించగా గిరిజన పెద్దలు బోధవత్ రవీందర్ నాయక్, లకావత్ గంగారాం, గుగులోత్ తుల్చా నాయక్, కోనేటి సాయి లు జ్యోతి ప్రజ్వాలన చేసారు.ఈ సందర్బంగా మోర శ్రీనివాస్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని, హిందూ ధర్మ గొప్పతనాన్ని బంజారాల తో పాటు ఆనాటి సమాజానికి దశ దిశను చూపి చైతన్యవంతం చేసిన మహనీయుడని,మేరా మయాడి (సాతీ భవాని )మాత ప్రియ భక్తుడని తెలిపారు.
నాటి సమాజములో ఉన్న జంతు బలిని,మూఢ విశ్వాసాలను తొలగించాలనే ఉద్దేశ్యముతో స్వయంగా తన శిరస్సు ని ఖండించి జగన్మాత కి నైవేద్యంగా అర్పించి ఆమె కటాక్షం తో తిరిగి యదాతతంగా ప్రాణం పోసుకుని అమ్మ వారి కృపకు పాత్రుడైన నిజమైన భక్తుడు గా సమాజ సేవకుడిగా సంఘ సంస్కర్త గా చరిత్ర లో నిలిచిన గొప్ప సాదువని
పేర్కొన్నారు. తన అహింస సిద్ధాంతం తో సేవాలాల్ మహారాజ్ ఒక్క బంజారా జాతి కే కాకుండా యావత్ ప్రపంచ దేశాలకి ఆదర్శమూర్తి గా నిలిచారాని కీర్తించారు.1739 ఫిబ్రవరి 15 న భీమానాయక్ ధర్మిణి భాయి దంపతుల సంతానం గా అనంతపురము జిల్లా లోని రాంజీ నాయక్ తండా అయన జన్మ ప్రదేశమని, అయన పరమపదించిన మహారాష్ట్ర లోని పౌరాఘడ్ గిరిజనుల దైవ క్షేత్రాలయ్యాయని తెలిపారు. కులాలరంగు మహనీయుల కి అంటించరాదని, వారి విశాల
భావాలను సిద్ధాంతాలను నేటి సమాజం అర్ధం చేసుకోవాలని, గడప లోపలే కులం గడప దాటితే మనమంతా ఒకే దేశ పౌరులమనే భావన నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.
ఇట్టి జయంతి కార్యక్రమం లో వేదిక ఉపాధ్యక్షులు లు కోడం రవి బూర శ్రీనివాస్,మాలోత్ సాయి కిరణ్, రవీందర్ నాయక్,సల్ల సత్యం రెడ్డి, భూక్యా రమేష్ నాయక్, శరత్ రెడ్డి,జితేందర్ రెడ్డి, బానోత్ బాపూరావు నాయక్, సందీప్, బుగ్గా రెడ్డి, పూల్ సింగ్, బానోత్ రాజ్య,రామ చంద్ర రెడ్డి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7