ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల భూమిలో ఆయిల్ ఫామ్ తోటలో అంతర్ పంటగా అరటి పంటను పండిస్తున్న రైతు లక్ష్మణ్ దంపతులు తోటను పరిశీలించడం జరిగింది.ఆయిల్ ఫామ్ చేసే రైతులకు ఆదర్శంగా నిలిచారు.
– అంతరపంటగా అరటి పంటను సాగు చేస్తున్న తీరు, అంతరపంటతో అదనంగా పొందే ఆదాయం గురించి రైతు లక్ష్మన్ ను అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ఫామ్ తోటను సాగు చేస్తూ దానిలో అంతర పంటగా అరటి పంటను సాగు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న రైతు లక్ష్మణ్ దంపతులను అభినందించడం జరగింది.
– ఆయిల్ఫామ్ సాగు రైతులకు అత్యంత లాభదాయకం. ఆయిల్ ఫామ్ సాగు చేస్తే మూడు లేదా నాలుగు సంవత్సరాల తర్వాత ఆదాయం వస్తదని చాలామంది అపోహ పడుతుంటారు కానీ ఆయిల్ఫామ్ తోటలలో తోట పెట్టిన మొదటి సంవత్సరం నుండే అంతర పంటలను పండించడం ద్వారా అధికంగా లాభం పొందవచ్చు అని లక్ష్మణ్ లాంటి రైతులు రుజువు చేస్తున్నారు.
– జిల్లాలో ఇప్పటికే 10,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటల సాగు చేయగా, ఈ సంవత్సరం మరో 10,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలను పండించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది. ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రిప్పు మరియు ఎరువులను ఫ్రీగా అందిస్తున్నాం.