మంత్రి కేటీఆర్ నేతన్నలకు శుభవార్త చెప్పారు వచ్చే నెల నుంచి చేనేత మిత్ర ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికునికి నెలకు 3000 పెన్షన్ను అందిస్తామని అన్నారు ఒకవేళ నేతన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం దహన సంస్కారాల ఖర్చుకు 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు అలాగే వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డు హెల్త్ కార్డు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు
