దౌల్తాబాద్: అప్పుల బాధ తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం… గ్రామానికి చెందిన తోట కుమార్ (36) జీవన ఉపాధి కోసం సంవత్సరం క్రితం గ్రామంలో దాబా పెట్టాడు. దాబా నడవక పోవడంతో నష్టం వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈనెల 9వ తేదీన దాబాలో పురుగుల మందు తాగి పడుకున్నాడు. గురువారం దాబాకు వచ్చినవారు గమనించి కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. తల్లి తోట అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
