దౌల్తాబాద్: పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని సర్పంచులు కేత కనకరాజు, అప్పవారు శ్రీనివాస్ లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు లింగరాజు పల్లి, గాజులపల్లి తదితర గ్రామాల్లో అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణీలకు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలతో పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కృష్ణమూర్తి, లక్ష్మి, ప్రభాకర్, నాగరాణి, పంచాయతీ కార్యదర్శులు యాదగిరి, హంసకేతన్ అంగన్ వాడి టీచర్లు సరోజ, రమాదేవి, ప్రతిభ, రాధిక, గిరిజ, అరుణ, యశోద, సరోజన తదితరులు పాల్గొన్నారు….
