సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 17(TS24/7 తెలుగు న్యూస్):ఈ రోజు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వట్టిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తాడూరి రజిత రాజేందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తల్లికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండీ మునీర్, కార్యదర్శి భానుచందర్, వార్డు సభ్యులు మరియు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూమా విజయకుమార్, తాడూరి తిరుపతిరెడ్డి, జగదేవపూర్ మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, మాజీ ఎంఆర్ పిఎస్ గ్రామ అధ్యక్షులు తప్పెట్ల సత్యనారాయణ, గ్రామ పెద్దలు అన్నేమైన కనకయ్య తదితరులు పాల్గొన్నారు