Breaking News

ఆగిన తండ్రి గుండె అగమ్య గోచరంగా చిన్నారులు : మానవతవాదులు దాతలు ఆదుకోవాలని వినతి

1,233 Views

ఎల్లారెడ్డి పేట,5 ఆగష్టు 2023
హఠాత్తుగా ఆగిన తండ్రి గుండెతో ఆ చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబం కష్టాల్లో పడింది. మనవతవాదులు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోల ప్రవీణ్ గౌడ్ (30) కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రేఖతో 2019లో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కూతుర్లు తన్విత (2)తపస్య (1)లు ఉన్నారు. ప్రవీణ్ గౌడ్, కొంతకాలం హైదరాబాదులో ప్రైవేట్ కాంటాక్ట్ నిర్వహిస్తూ అది ఆగిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో కార్మికుడిగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆగస్టు 1అర్థరాత్రి చాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ప్రవీణ్ మరణించారు. ప్రవీణ్ అకాల మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. భార్య రేఖ 23 సంవత్సరాల చిన్న వయసులోనే భర్తను కోల్పోయి చిన్న పిల్లల తో కష్టాల్లో పడింది. నివసించడానికి సొంత గూడు లేక ప్రస్తుతం బావ ఇంట్లో దశదిన కర్మ నిమిత్తం ఉంటున్నారు.పిల్లలకు తండ్రి ఎలా ఉంటారో తెలియని విషాదంలో కుటుంబం మునిగిపోయింది. మానవతా వాదులు, దాతలు మంచి మనసున్న మారాజులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.సహాయం చేయాలనుకునే దాతలు రేఖ 9912533064, విఘ్నేష్ 9542525145 ఫోన్ , గూగుల్ పే ద్వారా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *