ముస్తాబాద్,ఆగస్టు4,ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో సందర్శించిన డిపివొ ఎనగందుల రవీందర్ గ్రామంలోని మురికి కాలువలు, పాఠశాలలోని వంటగది నిర్మాణం గురించి అంగన్ వాడి సెంటర్ కు ప్రత్యేక మరమ్మతులు గురించి పరిశీలించాడు. గ్రామంలో ఇంకుడు గుంతలు పరిశీలించి, గ్రామంలోని వీధుల్లో,డ్రైడే ప్రైడే, నిర్వహిస్తున్న గ్రామ స్థాయి ఉద్యోగులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గాప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, ఐకెబి సీసీ లీలరాణి, ఆశ వర్కర్ భారతి, అంగన్ వాడి బాల్ లక్ష్మి , వివో ఏ జమున, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
