ప్రాంతీయం

కుల వేధింపులకు మృతి చెందిన ఎస్సై

62 Views

కుల వేధింపులకు మృతి చెందిన దళిత SI శ్రీనివాస్ మరణం కు రాష్ట్ర సీఎం.రేవంత్ రెడ్డి. రాష్ట్ర డీజీపీ లు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని దళిత బహుజన పార్టీ  జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు.

నేడు హిమాయత్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో జరిగిన మీడియ సమావేశం లో ఆయన మాట్లాడుతూ… తీవ్రంగా కుల వేధింపులు తనమీద సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు స్టేషన్ సిబ్బంది గురిచేస్తున్నారని జిల్లా ఎస్పీ. రాష్ట్ర డీజీపీ లకు మృతుడు పిర్యాదు చేసిన ఉన్నతఅ ధికారులు పట్టించికోలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తో చెప్పి SI ఉద్యోగం తీసివేస్తామని CI బెదిరించినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేయడం తోనే నీతి. నిజాయితీ తో విధులు నిర్వహించిన SI చనిపోయారని ఆరోపణలు చేసారు.SI మరణాకి బాధ్యలు స్టేషన్ CI జితేంద్ర రెడ్డి. సిబ్బంది మీద కఠినం గా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేటికీ దళిత జాతుల పైన కుల వేధింపులు జరగడం అత్యంత దారుణం అన్నారు. బాద్యులను తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలన్నారు.దళిత SI శ్రీనివాస్ మృతి ని తట్టుకోలేక ఆయన మేనత్త సైతం చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు.

ఈ మరణాలకు రాష్ట్ర పోలీస్ విభాగం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా బాధ్యత వహించాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన లో రాష్ట్రo లో దళితులకు రక్షణ లేదన్నారు.పోలీస్ శాఖ లో సైతం కుల వేధింపులకు గురై దళిత అధికారులు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదన్నారు. బాధితుల కుటుంబం నకు భరోసా కల్పించాలని. బాద్యులైన పోలీస్ అధికారులను కఠినం గా శిక్షించాలన్నారు. రాష్ట్రo లో కుల వేధింపులకు గురౌతున్న బాధితులు చనిపోవద్దని.. ఆత్మ రక్షణ కోసం జీవించే రాజ్యాంగ మానవ హక్కు రక్షణ కోసం ప్రత్యర్థులను చంపడానికి సిద్ధం కావాలని కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు.ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్. గ్రేటర్ అధ్యక్షులు ఎమ్. ప్రవీణ్. దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కో. ఆర్డినేటర్ ఇటికాల గణేష్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్