ఎల్లారెడ్డిపేట మండలంలోని కోకిల రెస్టారెంట్ సమీపం వద్ద శివరాత్రి శుభాకాంక్షలు 2025 ప్యాకెట్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. మంగళవారం రోజున ఆయన శివునికి ప్రీతిపాత్రంగా ఉన్న కిరణ్ నాయక్ శివుని భక్తితో సుమారుగా 1000 ప్యాకెట్ క్యాలెండర్లను అందరికీ పంచారు. నూతనంగా ఉన్న క్యాలెండర్ జేబులో పెట్టుకునే విధంగా అలంకార ప్రాయంగా శివుని మీద భక్తితో రూపొందించినట్లుగా చెప్పారు. బుధవారం రోజున మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఒకరోజు ముందే అందరికీ డిస్టబ్యూషన్ చేశారు. దీంతో ఆయన ఆధ్యాత్మికతను చాటుకున్నారు. బిజెపిలో కొనసాగుతున్న ఆయన శివునికి ప్రీతిపాత్రునిగా ఉంటానని మీడియాతో అన్నారు. చాలా అవలీలగా ఉంటుందని తేదీలు వారాలు నెలలు చూసుకునే విధంగా రూపొందించబడిందని ఆయన అన్నారు కార్యక్రమంలో ఆయన సన్నిహితులు ప్రతినిధులు వెంట ఉన్నారు.
