ముస్తాబాద్ ఆగస్టు4,మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపట్టి నేటికీ 30వ రోజుకు చేరుకుంది పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయితీ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద మహిళలు, పురుషులు కార్మికులు బతుకమ్మలు అసైదూల ఆటలాడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా మండల అధ్యక్షుడు జల్లి లక్ష్మణ్ తోపాటు కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ వచ్చి9.సంవత్సరాలు గడిచిన మాహక్కులు మాకురాలే కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ కేటీఆర్ కు మాత్రమే స్వతంత్రం వచ్చింది. మా కార్మికులకు ఎప్పుడొచ్చేది మామాజీవితం ఏండ్లు గడిచిన మావృత్తి, మాటైం, మాతలరాతతో పాటు మమ్మల్ని చిన్నచూపే తప్ప మాబతుకులు మారలే నేటికీ 30రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాన్యాయమైన డిమాండ్లను 11.వ పిఆర్సి ప్రకారం19600 జీతం ఇవ్వాలని అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మాకార్మికులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా జీవోలను పాతరపెట్టి లేవనెత్తకుండా సంవత్సరాలు గడుస్తున్న స్పందించడంలో చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా ఈప్రభుత్వం మెద్దు నిద్రవీడి సత్వరమే పరిష్కారం చూపాలని కోరారు. అలాగే 51జీవోను సవరించి పిఎస్ ఈఎస్ఐ ప్రమాద బీమా10.లక్షలు అమలుచేసి విధులు నిర్వహించుటలో గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఆదివారం పండుగ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.




