బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనంతరం శుక్రవారం హైదరాబాదు కు విచ్చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సన్మాన కార్యక్రమం జరిగింది. కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇట్టి సన్మాన కార్యక్రమంలో పాల్గొని బండి సంజయ్ కుమార్ ను శాలువా , పూలమాలతో సత్కరించారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కోసం బండి సంజయ్ కుమార్ చేసిన కృషికి తగిన గుర్తింపు దక్కిందన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ రాణించాలని, మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బిజెపి మీడియా సెల్ కన్వీనర్ కటకం లోకేష్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్ , నాగసముద్రం ప్రవీణ్ , శంకరపట్నం బిజెపి మండల అధ్యక్షుడు అనిల్ , నాయకులు ఉప్పరపల్లి శ్రీనివాస్ ,ఈసంపల్లి మహేష్ ,కమలాకర్ రెడ్డి , హరి తదితరులు పాల్గొన్నారు.
