ఏర్రల్ల శ్రీనివాస్ ను కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఇటీవల ముదిరాజ్ మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్, వారితో పాటు మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మర్కుక్ సర్పంచ్ భాస్కర్ ఉన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్ మేకల కనకయ్య ముదిరాజ్ ను శాలువాతో సత్కరించి ముదిరాజ్ సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తూ బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న మంచి పనులు వివరించాలని,రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం పని చేయాలని కోరారు
