ప్రాంతీయం

అక్రమ అరెస్టు ఖండిస్తూ ఎటువంటి పరీక్షలు లేకుండా సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్…

397 Views

ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు4, పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని సచివాలయ ముట్టడికి వెళ్లే క్రమంలో ఏఎన్ఎంలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఈసందర్భంగా నాగుల వసంతతో పాటు ఏఎన్ఎంలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023లో నోటిఫికేషన్ రద్దుచేసి 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఏఎన్ఎంలకు ఎటువంటి పరీక్షలు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం విధులు నిర్వహించడంలో ఏఎన్ఎంలు కరోన కష్టకాలంలో ప్రజలు ఇండ్లకే పరిమితం అవుతే మేంమాత్రం ధైర్యంగా కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించామని గుర్తు చేశారు. సంవత్సరాల తరబడి చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి రెగ్యులర్ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాగుల వసంత, బక్క ప్రమీల, రెండవ ఏఎన్ఎం కొల్లూరు రేణుక, రాజనర్సమ్మ, వాతపు విజయనిర్మల, జెలేంద్ర రేఖ, రాజశ్రీ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *