గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో బుధవారం రోజున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వేముల ఘాట్ భవన నిర్మాణ కార్మిక అధ్యక్షుడు దాతర్ పల్లి నర్సింలు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు,మల్లారెడ్డి లకు అభినందనలు తెలిపారు.ఏ ప్రగతికైనా మూల ఆధారం కార్మికుడు.ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదనే.ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని కార్డు ఉంటేనే కార్మిక సోదరులు లబ్ధి పొందే అవకాశం ఉందని అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలని ఇందు కోసం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మన మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేశారని అమావాస్య రోజున ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.మన ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి, మన కుటుంబం బరువు బాధ్యత మనపై ఆధారపడి ఉన్న సంగతి మరువద్దు,రైతుభీమా తరహాలో కార్మిక భీమా,కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు ప్రభుత్వం పెంచిందని,లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు భీమా పెంపు.కార్మిక-ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుందని,5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుతాయని,రూ.5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తిస్తుంది.అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామకృష్ణారెడ్డి,పేట బాబు, బోడెల్లి నర్సింలు,యాదగిరి,గజ్వేల్ మండల సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు కప్ప రామచంద్రం, కనకయ్య,మంద ప్రభాకర్,చాకలి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.




