Breaking News

సింగరేణి సంస్థ పరిరక్షణే ఏఐటీయూసీ ధ్యేయం*

200 Views

*సింగరేణి సంస్థ పరిరక్షణే ఏఐటీయూసీ ధ్యేయం*

:-2/(శ్రీరాంపూర్)*

సింగరేణి సంస్థ యొక్క పరిరక్షణే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ధ్యేయమని రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం ఏఐటియూసి ఆధ్వర్యంలో ఆర్కే-6 గని పై నిర్వహించిన ద్వార సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.ఆనాడు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరూ ఐకమత్యంగా దశలవారీగా ఆందోళనలు, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నేడు యాజమాన్యం హరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి యొక్క లాభాలను ఆర్థికంగా దోపిడీ చేసి సింగరేణి సంస్థ కార్మికులకు రావాల్సిన జీతాలు ఎరియర్స్ ను చెల్లించడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామని, ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం అమలు చేస్తామని చెప్పి, నేడు హామీలను అమలు పరచడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా కార్మికులకు కోలిండియా లో చెల్లిస్తున్నటువంటి ఇన్కమ్ టాక్స్ ను అదేవిధంగా సింగరేణిలో అధికారులకు చెల్లిస్తున్నటువంటి పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ ను కార్మికులకు కూడా చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 11వ వేజ్ బోర్డ్ కు సంబంధించిన 23 నెలల ఏరియర్స్ మొత్తాన్ని కోలిండియాలో చెల్లించిన విధంగా ఒకే దఫా చెల్లించాలని  ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ గొర్రె నర్సయ్య, ఫిట్ కార్యదర్శి సంగం సదానందం, కారుకూరి నగేష్, చిలుక రామ్ చందర్, తోట మహేష్, ఫిట్ కార్యదర్శిలు గునిగంటి నర్సింగరావు, ఆడేపు మల్లికార్జున్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ ఖాన్, దాసరి రాజేశం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *