ప్రాంతీయం

ప్రతి మొక్కను సంరక్షించాలి

96 Views

డీఆర్డిఓ చంద్రమోహన్

దౌల్తాబాద్: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని డి ఆర్ డి ఓ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని మొక్కలు తక్షణమే నాటించాలని అధికారులు సూచించారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్ గపూర్ ఖాద్రీ, ఏపీఓ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ యాదవ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *