తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం ఎంపీటీసీ సభ్యుడు పుప్పాల కనకయ్య కుమారుడు సతీష్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా, మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ రసమయి బాలకిషన్ సతీష్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి, సానుభూతిని వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వెంటా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి,సర్పంచ్ మామిడి సతీష్, పాశం అశోక్ రెడ్డి,ఉపసర్పంచ్ బుడిగే పర్శారములు గౌడ్, మన్నేంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్,ముంజం శ్రీనివాస్, నర్సింహ రెడ్డి, తదితరులు వున్నారు..