చెడు వ్యసనాలకు బానిస కావొద్దు ….
ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని
కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద , గ్రామ ప్రజలతో కలిసి పోలీస్ కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ ప్రజలకు నేడు జరుగుతున్న సైబర్ మోసాలపై గంజాయి డ్రగ్స్, దొంగతనాలు ,సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు, గ్రామంలో సీసీ కెమెరాలు గ్రామంలోకి ప్రవేశించే ప్రధాన కూడళ్ళ వద్ద వద్ద,బయటికి వెళ్లే దారి వద్ద ఏర్పాటు చేసుకొని నేరాలు జరగకుండా చేయవచ్చని, నేరస్తులను గుర్తించడానికి సులువుగా ఉంటుందని తెలిపారు
