వర్గల్ మండల్లో ఇప్పటివరకు
సాగు ఐన విస్తీర్ణం 2490 ఏకరాలు పత్తి, 850 ఏకరాలు వరి నాట్లు, 1310 ఎకరాలు మొక్కజొన్న, 400 ఎకరాలు తీపి మొక్కజొన్న, మరియు కురగాయలు ఇతర పంటలు 650 ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇప్పటి వరకు మండలం లో సాధరణ వర్షపాతం 181 mm కాగా ఇప్పటి వరకు 512.4 mm వర్షపాతం నమోదు ఐంధని మండల వ్యవసాయ అధికారిణి శేష శయన తేలిపారు.
అధిక వర్షపాతం కి పత్తీలో నిలిచిన నీరు ని సాధ్యమైనంత త్వరగా తీసేయాలని తెలిపారు.అధిక నీరు వలన కులు తెగులు ఆశించే అవకాశాలు ఉన్నందున కాపర్ ఆక్సీక్లోరైడ్ 3gm Ledhaa carbendazim 1gm లీటర్ నీటికి కలిపి మొక్క మొదటిలో తడపాలి. పసుపు రంగు మారిన ఆకులను గమనించి పొటాషియం నైట్రేట్ 5-10 గ్రా లీటర్ నీటికి కల్పి పిచికారి చేయాలి.
వారి నాటిన పొలంలో మోగి పురుగు గమనిస్తే కార్బోఫ్యూరిన్ 3g గుళికలు ఏకరం కి 8-10 kg లు నాటిన 20-25 రోజుల లోపు వేసుకోవాలి.
మొక్కజొన్న లో అధికం గా నిలిచిన నీతిని బైటకి పంపాలి. తర్వత అంతర్కృషి చేసి ఎకర కి 25 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ ఇచే ఎరువులని వేయాలి.
మండలంలో తునికికల్స, జబ్బాపూర్, మైలారం తాడితర గ్రామాల్లో వేసిన పత్తి పంటను సందర్శించి రైతులకు సూచనలను ఇచ్చారు.ఏఈవో ధర్మేందర్, సంతోష్ కుమార్ మరియూ రైతులు ఉన్నారు.
