దౌల్తాబాద్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా ప్రతిష్టించిన పీర్లను గ్రామంలో ఇంటింటికి తిప్పుతూ ఊరేగింపు చేశారు. ఊదు, కుడుకలు, సైదా కు దండలు, కానుకలు సమర్పిస్తూ కోరికలు కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.
