ఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు..
వరల్డ్ రికార్డ్ లెవెల్ మ్యాజిక్ కాంపిటీషన్ లో సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై. రమేష్ ఐబీఎం లో ఆన్లైన్ ద్వారా పాల్గొని సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 64 కళల్లో మ్యాజిక్ ఒక కళా అని , ప్రతి రెండు నెలలకోసారి ఆన్లైన్లో మ్యాజిక్ లో నిర్వహించే మ్యాజిక్ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, పోటీలు నిర్వహించడం వల్ల కళ లో దాగి ఉన్న మెలకువలను నేర్చుకోవాదానికి దోహద పడతాయని, కళలు మరుగున పడకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తనకు సర్టిఫికెట్ పొందడానికి సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.





