Breaking News

వాట్సాప్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌

87 Views

వాట్సాప్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది మొబైల్‌ నెంబర్‌ను సేవ్‌ చేయకపోయినా.. అవతలి వ్యక్తికి మెసేజ్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌తోపాటు ఆండ్రాయిడ్‌ వినియోగదారులు కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు కాంటాక్ట్‌ నెంబర్‌ సేవ్‌ చేసుకుంటేనే మెసేజ్‌ చేసేందుకు వీలుండేది. తాజా ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం ఉండదు.

 

*ఈ ఫీచర్‌ పొందడం ఎలా..?*

 

వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌చేసిన తర్వాత ‘స్టార్‌ న్యూ చాట్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి ఏ నెంబర్‌కు మెసేజ్‌ చేయాలనుకుంటున్నామో ఆ ఫోన్‌నెంబర్‌ను సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయాలి.

 

వాట్సాప్‌ ఆ నెంబర్‌ను సెర్చ్‌ చేసి సంబంధిత వ్యక్తికి మెజేస్‌ చేసేలా ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తుంది.

 

అయితే ఈ ఫీచర్‌ గురించి వాట్సాప్‌ ఇంత వరకు అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని పేర్కొంది.

 

ప్లేస్టోర్‌లోగానీ, యాప్‌స్టోర్‌లో గానీ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందో లేదో చెక్‌ చేసుకోవచ్చు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *