సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రజాపక్షం/ఇల్లంతకుంట
వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
జిల్లావైద్యాధికారి సుమన్ మోహన్ రావు సూచించారు.మండలములోని పొత్తూరు, వంతడుపుల గ్రామాల్లో శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి పర్యటించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది కి పలు సూచనలు చేశారు.అంతే కాకుండా అన్ని గ్రామాల ప్రజలు హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో, సబ్ యూనిట్ ఆఫీసర్ లింగం ,హెచ్ ఈ ఓ ఖుధ్దూస్, సూపర్ వైజర్ నయీం , ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
